నేటి సాక్షి .కొడిమ్యాల అక్టోబర్ 22 :శుక్రవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సంద్రాలపల్లి కస్తూర్బా, గురుకుల పాఠశాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలోని విద్యార్థుల. సిబ్బంది హాజరు పట్టికను హాస్టల్ లో గల మెస్ వంటగది, స్టోర్ రూం లను పరిశీలించారు. పాఠశాలలో, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి వారు భోజనం చేశారు. చలికాలం విష జ్వరాలు ప్రబలకుండా సరైన శానిటేషన్ పాటించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు.వారి వెంట తాసిల్దార్ కిరణ్ కుమార్, అర్. ఐ.లు తాదానంతరం రెవెన్యూ భూభారతి రికార్డులు పరిశీలించారు.





