*నేటిసాక్షి, నల్లబెల్లి* మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థునులకు తెలంగాణ దళిత విద్యావంతుల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పరికిరత్నం ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థునులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులను శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం బట్టు సాంబయ్య మాట్లాడుతూ… విద్యార్థులు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం దిశగా ప్రయాణించాలన్నారు. ఉన్నత స్థాయిలో నిలువాలనుకునే బాలికలు ఇప్పటినుండే ఉన్నతమైన ఆలోచన కలిగి ఉండాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చే విధంగా వారి ఆలోచన స్థాయి ఉండాలని ఆకాంక్షించారు. అలాగే పదవ తరగతిలో జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన వారికి మొదటి బహుమతిగా 5116 రెండవ బహుమతిగా 3116 ఆర్థిక ప్రోత్సాహం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సునీత ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





