నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడం పట్ల చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు శుక్రవారం టపాసులు పేల్చి ఘనంగా సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా పాలన చూసి జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కొట్టారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలతో రానుల రోజుల్లో అన్ని ఎన్నికల్లో హస్తం పార్టీ కైవసం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నాగం కుమార్ నాయకుల ముసుకు ముకుంద రెడ్డి. గొట్టే ప్రభాకర్. సంతపురి బాలు, ఇందూరి మధు, దూది శ్రీనివాసరెడ్డి, గసకంటి ప్రభాకర్, గంట మల్లేశం, బాణాల రవీందర్ రెడ్డి, సంటి దాసు, అమరబండ సాయి, ధర్మపురి శ్రీనివాస్, చంటి ప్రసాద్,పులి సత్యం తదితరులు పాల్గొన్నారు.





