నేటి సాక్షి, కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగళవారం రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. గంగాధర మండలం ర్యాలపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త గరిగంటి కరుణాకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్వంతంగా రూ.3 లక్షలు, ప్రభుత్వం తరపున రూ. లక్ష బాధిత కుటుంబానికి అందజేసి మానవత్వం చాటుకున్నారు.

