Tuesday, March 10, 2026

*కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం పై ఆలోచిస్తా…* *మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు* ————————————–

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )…………………………………..కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరోసారి నంచలన వాఖ్యలు చేశారు.జగిత్యాల ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మార్పుపై మాట్లాడుతూ..జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక రోజే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆనాడే ఊహించానని పేర్కొన్నారు.అంతే తప్పా ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్లలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిత్రులు, కార్యకర్తలు సూచనలు, సలహాలు తీసుకుంటానని సమయం, సందర్భం వచ్చినప్పుడు తగిన నిర్ణయం తీసుకుంటానని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News