నేటిసాక్షి, కరీంనగర్:కరీంనగర్‌లోని విజయనగర్ కాలనీకి చెందిన అబ్దుల్ హమీద్ మంగళవారం దాదాపు 100 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యులు అంజన్ కుమార్, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మన్ మడుపు మోహన్ అబ్దుల్ హమీద్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినారు. అబ్దుల్ హమీద్ గత ఏడు సంవత్సరాల నుండి విజయనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త కార్యదర్శిగా పనిచేయడంతో పాటు కాలనీ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించడం, యువతను ఉపాధి వైపు నడిపించడం, యువకుల్లో క్రీడా స్ఫూర్తిని నింపుతూ డివిజన్ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ హమీద్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అబ్దుల్ హమీద్ 34వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తూ అంజన్ కుమార్‌కు దరఖాస్తు సమర్పించినారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో అహ్మద్ మహమ్మద్, షేక్ మహమూద్, హఫీజ్ ముజ్జు, ఇర్షద్ యాకూబ్, ఖాజిం, సుమీర్, ముజాహిద్, రవూఫ్, తాజ్, ఆన్సర్ ఒజామా, అపర్ణ, సంతోష్, వెంకటేష్, రాజు, రాజయ్య తదితరులు ఉన్నారు.

