—- స్థానిక సంస్థలు దగ్గర పడుతున్న సందర్భంగా.. నియోజకవర్గంలో కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం
—- రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పటి పాండు రంగారెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
ఎఐసిసి ఆదేశం మేరకు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గంలో అడుగులు ముందుకు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం డీసీసీ అధ్యక్ష పదవి మినహాయించి మిగిలిన కమిటీలన్ని దాదాపుగా రద్దు అయ్యాయి. పార్టీ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి.. పార్టీని మరింత బలోపేతం చేయాలన్న పిసిసి ఆదేశం మేరకు, పార్టీ సంస్థాగత ఎన్నికల పరివేక్షకుల సూచనలతో మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ కె.ఎల్.అర్ సమన్వయంతో నియోజకవర్గంలో కమిటీల ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. అందులో బాగంగా నేడు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి, పార్టీ కంస్టర్ కన్వీనర్ కంబాల పల్లి మదన్ పాల్ రెడ్డి,కోఆర్డినేటర్ యుగంధర్ గౌడ్, సభ్యలు బండ వేణుగోపాల్, యాదయ్య ముదిరాజ్,జాపాల బలరామ్,శ్రీనివాస్ కురుమ,జ్ఞానేశ్వర్ చారీ, ఏకుల మహేందర్ తదితరులు మహేశ్వరం మండలంలోని పోరండ్ల,కోళ్ళపడుకల్, లిల్లిపూర్,గట్టుపల్లి,పడుమటి తండ గ్రామలలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలసి గ్రామాలలో ప్రజా ప్రభుత్వం చేస్తన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై స్థానిక ప్రజలకు వున్న అవగాహనను స్థానిక కాంగ్రెస్ నాయకులతో అడిగి తెలుసుకున్నారు.
ధన్యవాదములతో…

