Thursday, January 22, 2026

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా…

రైతు భరోసా సంబరాల పండుగ హర్షం వ్యక్తం చేసిన మక్తల్ మున్సిపల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…. నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 24,తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను గత సోమ వారం నుంచి అకౌంట్లలో జమ చేస్తోంది. ఇవాళ ఏకంగా 15 ఎకరాల వరకూ ఉన్న రైతులకు డబ్బు జమ చేసింది. అందువల్ల 15 ఎకరాలు ఉన్న రైతులకు.. ఎకరానికి 6వేల చొప్పున 9 రోజుల్లో మొత్తం రూ.9 వేల కోట్లు ను రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది, గత సోమవారం ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డిగారు ప్రారంభించినారునాడు దేశవ్యాప్తంగా.. నేడు తెలంగాణలో రుణమాఫీ..దేశంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రైతులకు రూ. 70 వేల కోట్లు రుణమాఫీ జరిగింది. తెలంగాణలో ఇప్పుడు 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ. 21 వేల కోట్లు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చెల్లించింది.తొలకరికి ముందే రైతులకు పెట్టుబడి సాయం అందించిన తొలి ప్రభుత్వం గా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిలిచింది. ప్రజా ప్రభుత్వం గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానిది, రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని మరోసారి చాటి చెప్పిన ఘనత రేవంతన్న సర్కార్ దిఇంత గొప్ప కార్యక్రమానికి నాంది పలికి తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా తో పాటు యావత్ కాంగ్రెస్ కుటుంబానికి నైతిక భరోసాను కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి,వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి,రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి & పశుసంవర్ధక శాఖ మాత్యులు గౌరవ శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచా కాలుస్తూ రైతులతో కలిసి రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది.. మక్తల్ మున్సిపల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి పెద్ద ఎత్తున రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు& కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News