Sunday, March 8, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి.

*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రికేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం కేంద్రంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు.పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.బిఆర్ఎస్ రాష్ట్రఅధినాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డు పై నిరసన తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోన్ టాపింగ్ అనేది రాష్ట్ర అంతర్గతంగా భద్రత గురించి ఆయా రాష్ట్రాలు నిఘా వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని అసలు ఇది కేసే కాదన్నారు.కేవలం రాజకీయంగా కక్ష సాధిస్తూ మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తున్నట్లు వారు విమర్శించారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో.మండల అధ్యక్షులు గోస్కుల జలందర్.మాజీ ఎంపీపీ నక్క శంకరయ్య మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం,కాంపెల్లి హన్మాండ్లు,చెవుల రవీందర్ ఎరవేణి రమేష్ నల్ల శామ్ రవీందర్ సత్యం బాలాభక్తుల కిషన్ లింగారెడ్డి కచ్చు కొమురయ్య కోమల్ల జలందర్ సామాల విరస్వామి ధావుల రాకేష్ నవ తిరుపతి పోషయ్య బిఆర్ఎస్ మండలం నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News