నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 20, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందుకు వల్ల ప్రజా సంక్షేమాన్ని కొనసాగుతుందని నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణపేట నియోజకవర్గం లోని మరికల్ మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి విస్తృత పర్యటన చేశారు. అనంతరం ఆమె ఇందిరమ్మ ఇండ్ల మంజూరి గావించిన లబ్ధిదారులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహాలను మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. లేదని ఎవరు కూడా దిగులు కావలసిన అవసరం లేదని ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. మరియు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరైన ప్రతి ఇంటికి రూ 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇంట్లో నిర్మాణాలు పూర్తి కాగానే రెండవ విడత ఇందిరమ్మ గృహాలను మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మరికల్ ఎంపీడీవో కొండన్న,, మరికల్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, హౌసింగ్ బోర్డ్ అధికారులు, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, గొల్ల కృష్ణయ్య, మండల అధ్యక్షుడు వీరన్న, మరికల్ పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్, సీమ గోపాల్, నాయకులు సూర్య ప్రకాష్, రామకృష్ణారెడ్డి, పి. సత్యనారాయణ, జనార్ధన్, చెన్నయ్య, రాఘవేంద్ర, ఆంజనేయులు, రామకృష్ణ, గాజుల మహమ్మద్, విజయ్, గొల్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.





