Saturday, March 21, 2026

కాంగ్రెస్, బిఆర్ఎస్ నుంచి సిపిఎం లో భారీగా చేరికలు-పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరిక : ఆలేటి బిందు

నేటిసాక్షి, మిర్యాలగూడ : మండలంలోని ఆలగడప గ్రామంలోని కాంగ్రెస్, బిఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు, నాయకులు సోమవారం రాత్రి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సమక్షంలో సిపిఎం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, పేదల పక్షాన నిరంతరం పోరాడే సిపిఎం పార్టీకి పేద ప్రజలు అండగా నిలవాలని కోరారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం రాజులేని పోరాటాలు నిర్వహిస్తుందని, ఏనాడు పదవుల కోసం ఆశించకుండా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. పేద ప్రజలు సిపిఎం పార్టీకి అండగా నిలిచి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ సిద్ధాంతాలను యువత మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజా మానవాళికి ఎర్రజెండనే ప్రత్యామ్యామని యువకులు చైతన్యవంతులై సిపిఎం పార్టీని బలపరచాలని కోరారు. సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరా… ఆలేటి బిందు : పేద ప్రజల కోసం పనిచేసే సిపిఎం పార్టీ సిద్ధాంతాలను నచ్చి తనతోపాటు తన కుటుంబం బంధువులు గ్రామంలోని యువకులు మహిళలు భారీగా పైగా సిపిఎం పార్టీలో చేరినట్లు బీటెక్ చదివిన విద్యార్థి ఆలేటి బిందు తెలిపారు. సమాజ శ్రేయస్సు కొరకు సిపిఎం పార్టీ చేస్తున్న ఉద్యమాలు ఎంతో గొప్పవి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం పేద ప్రజలపై ఉందని చెప్పారు. ఆలగడప గ్రామ సర్పంచ్గా తాను బరిలో నిలుస్తున్నానని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఆమె తో పాటు పూసపాటి నాగేందర్, పెద్ద పంగ మహేష్, మంద మహేష్, కొత్తపల్లి ఎల్లయ్య, కొత్తపల్లి శ్రీను, తోకల కోటయ్య, యార సుందరి, ఇంద్రపల్లి మధు, మీసాల వినోద్, యారం నాగరాజు మరి కొంతమంది చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, పట్టిం రామచంద్రయ్య, పట్టేటి వెంకటయ్య, భాషబోయిన పాపయ్య, పి వెంకటయ్య, గండెల శ్రీను, నాగేందర్, రామదాసు, వెంకటనారాయణ, సైదాచారి, ఇంద్రపల్లి సీమోను తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News