Wednesday, March 4, 2026

*కాంగ్రెస్ వాదులకు దేవపంగు దాసు స్ఫూర్తిదాయకం*

నేటి సాక్షి కోదాడ (అనంతగిరి)కాంగ్రెస్ వాదులకు దేవపంగు దాసు స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముసుకు శ్రీనివాసరెడ్డి అన్నారు.మండల పరిధిలోని అమీనా బాద్ గ్రామంలో ఇటీవల చనిపోయిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవపంగు దాసు దశదిన కర్మలో పాల్గొని దాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.భవిష్యత్ తరాలకు దాసు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతారని పేర్కొన్నారు.పార్టీపై మమకారంతో జీవిత కాలం కాంగ్రెస్ కండువా భుజాన వేసుకుని నికసైన కాంగ్రెస్ వాదిగా జీవించాడని అన్నారు.అవసరాల కోసం పార్టీలు మారుతున్న నేటి కాలంలో పేద వాడిగా ఉన్నప్పటికీ పార్టీకి అనేక సేవలు చేశాడని కొనియాడారు.ప్రతి కార్యకర్త దాసు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పార్టీకి కట్టుబడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డా.కోటేశ్వరరావు,చిలకమూడి శ్రీనివాసరావు,బోడపూడి లక్ష్మీనారాయణ,రామినెని శ్రీను,కీత లక్ష్మీనారాయణ,మీసాల రాజేష్,మీసాల నరేష్,బచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News