నేటి సాక్షి వికారాబాద్:మాజీ కేంద్ర మంత్రి, దివంగత నాయకులు శ్రీ గడ్డం వెంకటస్వామి (కాకా) వర్ధంతి సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, కాకా వెంకటస్వామి కేవలం ఒక నాయకుడే కాదని, లక్షలాది మంది కార్మికుల, నిరుపేదల గొంతుకగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఒక సాధారణ కార్మికుడి స్థాయి నుండి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన ఆయన జీవితం నేటి తరం నాయకులకు, యువతకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ముఖ్యంగా పేదలకు గూడు కల్పించడం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని, వేలాది మందికి విద్యను అందించడం ద్వారా సమాజంలో వెలుగులు నింపారని ఎస్పీ వివరించారు. కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజ సేవలో ఆయన చూపిన చొరవను స్ఫూర్తిగా తీసుకుని బాధ్యతాయుతంగా మెలగడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు కె.డేవిడ్ విజయ్ కుమార్,అంజాద్ పాషా లు,పి.సురేష్ లు, ఆర్‌ఎస్‌ఐ లు, ఎస్‌ఐ లు, సిబ్బంది పాల్గొని కాకా కి నివాళులు అర్పించారు.





