ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) పార్టీ కార్యాలయాన్ని ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ షకీల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐయుఎంఎల్ పార్టీ ప్రజాసేవ, సామాజిక న్యాయం, అన్ని వర్గాల ప్రజల సమస్యలు, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల మధ్యే ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.యువత, మహిళలు రాజకీయాల్లో చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పలువురు కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఐయుఎంఎల్ పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యంగా మహిళలు సామాజిక న్యాయానికి పాటుపడాలని వారు సూచించారుఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి & జిల్లా ఇంచార్జి మహమ్మద్ అలీమ్, హుసైని కాగజ్‌నగర్ టౌన్ అధ్యక్షుడు షేక్ సలీం, మంచిర్యాల జిల్లా మహమ్మద్ ఉస్మాన్ సోఫీ నాయకులు,టౌన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

