నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 6రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో శాంతి–భద్రతల పరిరక్షణను మరింత బలపరచే లక్ష్యంతో నేడు కాగజ్‌నగర్ పట్టణంలో పోలీసు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ .పాల్గొన్నారు.ఫ్లాగ్ మార్చ్‌లో కాగజ్‌నగర్ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ ల పోలీస్ అధికారులు, సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పట్టణంలోని ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాల్లో మార్చ్ కొనసాగించారు. జిల్లాఎస్పీ మాట్లాడుతూరానున్న గ్రామపంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా జరగడానికి పోలీస్ భద్రత పూర్తిచేసినట్లు ఎస్పీ తెలిపారు.ప్రజల్లో నమ్మకం పెంపొందించడం, శాంతి పరిస్థితులను పర్యవేక్షించడం మరియు ఎన్నికల సమయంలో అసాంఘిక.అవాంఛనీయ చర్యలను అరికట్టడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశ్యం అని జిల్లా.ఎస్పీ తెలిపారు.ఎవరైనా గందరగోళం సృష్టించడం, బెదిరింపులకు పాల్పడటం, అక్రమ ప్రవర్తనలు చేయడం లేదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదని అన్నారు.ప్రజలు ఎన్నికల నియమాలను పాటించాలని, డబ్బులు, మద్యం, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 3 ప్రధాన చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామని అన్నారు.ఎన్నికల సమయంలో ప్రజ భద్రతలకు భంగపరిచే ఏ చర్యలకైనా జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొల్పి, ప్రజలు భయభ్రాంతిలేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తారని పేర్కొన్నారు.ఈ ఫ్లాగ్ మార్చ్ నందు కాగజ్నగర్ డిఎస్పి వాహీదుద్దీన్, కాగజ్నగర్ టౌన్ సి ఐ.ప్రేమ్ కుమార్, కాగజ్నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, సబ్ ఇన్స్పెక్టర్లు సుధాకర్,కళ్యాణ్, సందీప్, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.





