Wednesday, January 21, 2026

కాగజ్ నగర్ ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్,పేషంట్ కేర్,సెక్యూరిటీ సిబ్బందికి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి పిఎఫ్ పూర్తి వివరాలు తెలియజేయాలి

నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జూన్ 21

AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్

వేతనాలు చెల్లించని, ESI, PF కట్టని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి(TVVP)లో పనిచేస్తున్న శానిటేషన్,పేషెంట్ కేర్,సెక్యూరిటీ సిబ్బందికి పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని కార్మికుల యొక్క పిఎఫ్ పూర్తి వివరాలు తెలియజేసి,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. శనివారం రోజున కార్మికులతో కలిసి హాస్పటల్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఆస్పటల్ సూపర్డెంట్ మరియు ఇన్చార్జి డిసిహెచ్ఎస్ చెన్నకేశవ గారికి తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి)ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ వేతనాలు,ESI, PF డబ్బులు కట్టని కాంట్రాక్టర్ పై గత అనేక సంవత్సరాల నుంచి పిర్యాదు చేసిన అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు,కార్మికులు చాలీచాలని వేతనాలు తీసుకుంటూ హాస్పటల్ కు వచే రోగులకు సేవలు చేస్తూ ఎన్నో ఇబ్బందులకు గురైనప్పటికీ కార్మికులకు వేతనాలు చెల్లించడంలో కాంట్రాక్టర్/ఏజెన్సీ వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు,దీంతో కార్మికులు వారి కుటుంబాలు పస్తులు ఉంటూ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి ఇతర సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు కాంట్రాక్టర్/ఏజెన్సీ అధికారులను కలిసినప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు, అధికారులు రేపు,మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు ఇప్పటికైనా వేతనాలు,ESI,PF కట్టని కాంట్రాక్టర్/ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కేవలం కాంట్రాక్టర్లు/ఏజెన్సీలు ఇచ్చి కమిషన్లకు అలవాటపడుతూ కొంతమంది అధికారులు కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని అన్నారు, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుచేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ,గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు,ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి పిఎఫ్ పూర్తి వివరాలు తెలియజేయాలని ESI సౌకర్యం కల్పించి ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది ఇమ్రాన్,సాయి ,తిరుమల,పుష్ప,మీనాక్షి తోపాటు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News