నేటి సాక్షి, కాగజ్ నగర్ : కాగజ్ నగర్ ప్రింట్ మీడియా న్యూ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా వొడ్నాల వెంకన్న, అధ్యక్షులుగా కాంపెల్లి రతన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎండి నౌషాద్, ఉపాధ్యక్షులు నూకల వీరేషం, అర్షద్ అలీ, గౌరవ సలహాదారులుగా ఎ.శ్రీశైలం, చందుజీ, ఎండి మెహరాజ్ తో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగజ్ నగర్ న్యూ ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అధ్యక్షులు కాంపెల్లి రతన్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎండి నౌషాద్ లు ఒక ప్రకటన లో పేర్కొన్నారు. పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల ను పరిష్కరించడానికి వారికి ఎల్లప్పుడూ అందుబాటు లో ఉండటానికి తమ వంతు కృషి చేస్తామని హామి ఇచ్చారు. వివక్ష చూపకుండా తోటి పాత్రికేయులకు న్యాయం చేస్తామని, సభ్యులు, పదాధికారులకు జవాబుదారితనం గా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను పూల మాల, శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ముకష్షిర్, దుర్గం నిరంజన్, హరికృష్ణ చౌహాన్, అహ్మద్ పాషా, ఫారుక్, అతీక్ తదిరులు పాల్గొన్నారు.

