(నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 30:)* కేశంపేట్ మండల పరిధిలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఉమాకి అభినందనలు తెలియజేసిన బిజెపి మండల నాయకులు. రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ యువ నాయకులు కర్రెడ్ల నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కొంతకాలంగా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూన్నా ఉమా గారు ఇప్పుడు గ్రూప్ 2కి ఎంపికైన సందర్బంగా అభినందనలు తెలియడం జరిగింది. ఒకవైపు పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ మరోవైపు ఫ్యామిలీని చూసుకుంటూ. గ్రూప్ 2 కి ఎంపికై సెక్రెటరీయేట్ లో బాధ్యతలు నిర్వహించబోతున్న మీకు అభినందనలు మరిన్ని ఉన్నతమైన పదవులకు ఎదగాలని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కౌన్సిల్ సభ్యులు కంచుకోట మహేష్, మండల ప్రధాన కార్యదర్శి కల్వకుల్ తిరుపతి, పిప్పళ్ళ నరేందర్ మరియు బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది





