Wednesday, February 18, 2026

*కారణజన్ముడు కేసీఆర్ : సింహాచలం జగన్** ఎండపల్లిలో ఘనంగా తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు *

నేటి సాక్షి, ఎండపల్లి:* తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శిల్పి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను పార్టీ శ్రేణులతో కలిసి కోసి మిఠాయి, పండ్లు పంపిణీ చేసి తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సింహాచలం జగన్ మాట్లాడుతూ.. “తెలంగాణ కోసం నిరంతరం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు కేసీఆర్ అని ఆయన త్యాగాలు, దీక్ష, పట్టుదల వల్లే తెలంగాణ ప్రజల కల సహకారమైందన్నారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన దూరదృష్టి నాయకుడు కేసీఆర్” అని కొనియాడారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, మిషన్ భగీరథ వంటి పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ సరఫరా రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారని రానుంది బీఆర్ఎస్ సర్కారే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. “కేసీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేస్తూ పార్టీ బలోపేతంకు తోడ్పాటు అందించాలన్నారు. ఈ వేడుకల్లో మారం జలంధర్ రెడ్డి, శానబండ సర్పంచ్ గాధం భాస్కర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడిదం నారాయణ, యువ న్యాయవాది రామడుగు రాజేష్, ఉద్యమకారుడు పడిదం వెంకటేష్, నాయకులు గంధం లక్ష్మీనారాయణ, కోడి గంగయ్య, ముక్తి చందు, తనుగుల జగతి, ఉప్పు రాజయ్య, గంధం రవి, చింతల తిరుపతి, రాజేశం, శేరే సత్తయ్య, ఇప్పల రాజ్ కుమార్, దేవి మహేష్, శ్రీనివాస్, శేఖర్, రవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News