నేటి సాక్షి, కరీంనగర్: బండి సంజయ్ మరోసారి ఎంపీగా భారీ మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ కరీంనగర్‌కు చెందిన బీజేపీ నేతలు తోట అనిల్, శ్రీరాముల శ్రీకాంత్ ఆధ్వర్యంలో 25 మంది కార్యకర్తలు గురువారం సాయంత్రం మారుతీనగర్ చౌరస్తా నుంచి కొండగట్టు వరకు పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా అనిల్, శ్రీకాంత్ మాట్లాడుతూ దేశానికి మోదీ, కరీంనగర్‌కు బండి సేవలు ఎంతో అవసరం అన్నారు. ఎంపీ సంజయ్ సుమారు 12 వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారని, కరీంనగర్ పార్లమెంటు సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేశారరని గుర్తు చేశారు. తిరిగి రెండోసారి ఎంపీగా బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలవాలని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. కరీంనగర్ మారుతి చౌరస్తా నుంచి ప్రారంభమైన యాత్ర కొండగట్టు వరకు సాగుతుందని, దేవాలయంలో అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.