నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు)

66 వ డివిజన్ కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఉన్నత పాఠశాల హసన్ పర్తి యందు పర్యావరణ మిత్ర యూనిట్ ఆధ్వర్యంలో కాలుష్య రహిత హోలీ ఉత్సవాన్ని నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారామ్ కర్ణ మాట్లాడుతూ సప్త వరణాల శోభితమైన వసంతోత్సవ కేలి హోలీ ఈ హోలీ పండుగ ఆనందాన్ని ఉత్సాహాన్ని రేకెత్తిస్తుందని ప్రకృతి రంగులలో మిళితమైన వసంత రుతువును ఆహ్వానిస్తూ మనస్సు నిండుగా కనుల పండుగగా ఆనందోత్సాహాలతో జరుపుకునే కనుల విందైన పండుగ హోలీ వయసుతో నిమిత్తం లేకుండా అందరూ రంగులు పూలుముకుంటూ కేరింతలతో ఆనందాలతో ఉత్సాహంగా జరుపుకుంటారు కానీ నేడు ఇటువంటి సప్త వర్ణ శోభితమైన వసంతోత్సవ కేలిని అత్యంత విష పూరితమైన రసాయనాలతో కూడిన రంగులు వాడుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాం రసాయనాలతో కూడిన రంగులు పులుముకోవడం వలన చర్మవ్యాధులు అలర్జీ ఆస్తమా కంటి చూపు కోల్పోవడం వెంట్రుకల రంగు మారిపోవడం వంటివి జరుగుతున్నాయి కనుక సహజంగా లభించే పసుపు కుంకుమ బుక్క గులాలు మరియు చెట్ల పూలతో తయారు చేసిన రంగులను వాడాలని వీటి ద్వారా ఎటువంటి హాని లేకపోగా శరీరానికి మరింత కాంతి సౌందర్యం లభిస్తాయని విద్యార్థిని విద్యార్థులందరూ ఈ హోలీ పండుగను విష పూరితం చేయకుండా కాలుష్య రహిత హోలీని జరుపు కోవాలని తెలియ చేసారు ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులను ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని రంగు, రంగుల పండుగను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గూడూరు లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు జూపాక నాగరాజు ఏ వెంకట్ ఈ ప్రవీణ్ పి వెంకటేశ్వర్లు వై అరుణ జి సంధ్య సిహెచ్ సంధ్య సిహెచ్ సుచిత్ర ఎల్ సరిత పి మౌనిక జి దేవిక సబిహ బేగం ప్రవళిక దేవిక భవాని సుధారాణి లావణ్య తదితరులు పాల్గొన్నారు.





