నేటి సాక్షి, కోరుట్ల అర్బన్ (కోరుట్ల అర్బన్ ):-
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇకపై మంత్రి చేతుల మీదుగా…
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు
ముత్యంపేట సుగర్ ఫ్యాక్టరీని త్వరగా పున ప్రారంభించాలి…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల పట్టణ జిఎస్ గార్డెన్ లో శనివారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ల ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు కాంగ్రెస్ పార్టీ 9 రోజుల్లోనే 2 లక్షల 48 వేల 550 మంది రైతులకు రైతు భరోసా కింద 243 కోట్ల 33 లక్షల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మాట్లాడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల వివదిలోనే 49 వేల ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు నిజంగా మీరు తప్పు చేయకుంటే చర్చకు రావాలి కదా అని ప్రశ్నించారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు సంబంధించిన నిధులను కూడా కాలేశ్వరం ప్రాజెక్టుకు మళ్ళించడం జరిగిందని దానిపై తాను మంత్రి అయ్యాక ఇటీవల హైదరాబాదులో ఆయా శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించడం జరిగిందని దానిలో జరిగిన అవినీతిపై త్వరలోనే జరగబోయే అసెంబ్లీలో బయటపెడతానన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తల కృషి చేయాలన్నారు తాను కూడా ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి నేడు ఈ స్థాయిలో ఉన్నానని కేవలం అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు ఇటీవల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో జరిగిన సమావేశంలో పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడం జరిగిందన్నారు కావున కార్యకర్తలు కష్టపడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలన్నారు రాష్ట్రంలో 28 శాతం బడ్జెట్ తన వద్ద ఉన్న శాఖలో ఉందన్నారు కావున ప్రతి శనివారం ఆదివారం జిల్లాలో అందుబాటులో ఉండి ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నేరుగా తన వద్దకు రావాలని సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానన్నారు అనంతరం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా మీ ద్వారానే పంపిణీ జరిగే విధంగా అధికారులను ఆదేశించారని కోరారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పూడూరు ఖాదీ బోర్డు భూములను టిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలకు నాయకులకు అమ్మడం జరిగిందని దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంక్వయిరీ జరుగుతుందని త్వరలోనే దోషులకు శిక్ష పడడం ఖాయమన్నారు రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని మెజార్టీ స్థానాలు సంపాదించుకుంటే అంత నిధులు నియోజకవర్గానికి వస్తాయని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి సబ్ ప్లాన్ నిధులు అధిక మొత్తంలో మంజూరు చేయాలని కోరారు అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో ఏకైక రైతు ఆధారిత పరిశ్రమ అయినటువంటి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని త్వరగా పున ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు గత ప్రభుత్వంలో ముత్యంపేట సుగర్ ఫ్యాక్టరీ పున నిర్మాణం కోసం తాను నల్ల బ్యాడ్జీని ధరించడం జరిగిందని ప్రతి నెల 22వ తేదీన నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగిందన్నారు కావున ముత్యంపేట సుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం తర్వాతే తాను ధరించిన నల్ల బ్యాడ్జీని తొలగిస్తానన్నారు ఖాదీ బోర్డుకు సంబంధించిన కిసాన్ నగర్ పూడూరు భూముల్లో జరిగిన అవినీతి జరిగిందని దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని కోరారు గత ఎమ్మెల్యే కాలేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల కమిషన్ తీసుకున్నారన్నారు మెట్పల్లి పట్టణంలో గల ఖాది బోర్డు కు సంబంధించిన భూముల్లో షట్టర్లు పెట్రోల్ బంకులు ఉన్నాయని వాటి ద్వారా ఎంత ఆదాయం వస్తుంది అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదన్నారు దానిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరారు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు కోరుట్ల పట్టణంలో 5000వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టారని మళ్లీ కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గంలో సుమారు 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు గత ప్రభుత్వాలు మాటలకే కానీ చేతల్లో లేవని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు 200 యూనిట్ల విద్యుత్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాకుండా రేషన్ దుకాణాల ద్వారా పేదలు కూడా కడుపునిండా తినాలని సంకల్పంతో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు కావున కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు కొమిరెడ్డి విజయ్ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు





