నేటిసాక్షి/తాడ్వాయి/ములుగు(ప్రతినిధి)ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామ పరిధిలో తరతరాలుగా పోడు భూములను నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలపై అటవీ శాఖ అధికారులు సాగిస్తున్న అరాచకాలను బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన అధికారులకు ప్రభుత్వానికి మంత్రి సీతక్క కి విన్నపం చేస్తూ కాల్వపల్లి ఆదివాసీల జోలికి రావద్దు కాల్వపల్లి గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లోకి అటవీ శాఖ అధికారులు చొరబడి వారిని భయభ్రాంతులకు గురి చేయడం అత్యంత దుర్మార్గం. తక్షణమే ఈ దాడులు నిలిపివేయాలి లేనిపక్షంలో బాధితుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందిమంత్రి సీతక్క ఇలాకాలో ఈ అన్యాయమా?: స్వయంగా గిరిజన బిడ్డగా ఆదివాసీల కష్టాలు తెలిసిన మంత్రి సీతక్క సొంత జిల్లాలోనే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే అడవి బిడ్డలపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత బాధాకరం గిరిజనుల ఓట్లతో గెలిచి వారి హక్కులను కాపాడలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం హక్కులు కాలరాయడం తగదు ఎన్నికల ముందు పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అటవీ శాఖ అధికారులను ఉసిగొల్పి దాడులు చేయించడం ఆదివాసీలను వంచించడమే కాల్వపల్లి గిరిజనులకు వారి భూములపై ఉన్న సాగు హక్కును ప్రభుత్వం గుర్తించాలి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఆదివాసీల కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదు. అధికారుల దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం భూమి ఆదివాసీలది హక్కు కాల్వపల్లి బిడ్డలది అధికారులు తక్షణమే తమ వైఖరి మార్చుకుని గిరిజనులకు ఆందోళన కలిగించకుండా వారి భూములు వారికి సాగు చేసుకునే అవకాశం కల్పించాలని భారత రాష్ట్ర సమితి ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు.





