నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 8మండలంలోని చిన్న కొండ మర్రి సమీపంలో గల విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక శనివారం విశేష పూజలు నిర్వహించారు ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో అభిషేక ప్రియుడు శివునికి విశేష అభిషేకము పంచామృతాభిషేకము నారికేలాభిషేకము వంటి అభిషేకాలు కన్నుల పండుగల నిర్వహించారు అనంతరం విశేష అలంకరణ గావించారు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ నిర్మాణ కర్త మనోహర్ ఆధ్వర్యంలో భక్తులకు పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు





