నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)………………………………..కీర్తిని పొందడానికి డబ్బుతో పనిలేదని, మనం చేసే పనులవల్లే కీర్తి లభిస్తుందని భాగవత సప్తాహా ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర భిరుద్దాన్కితులు బ్రహ్మశ్రీ బుర్రా భాష్కర శర్మ అన్నారు.జగిత్యాల జిల్లా కేంద్రం గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో భాగవత సప్తాహ ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర, బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం శుక్రవారం 5 వ రోజుకు చేరింది. *ఈ సందర్బంగా బ్రహ్మ శ్రీ భాస్కర శర్మ మాట్లాడుతు*సత్ కర్మల ఫలితం, సాధనతోనే శక్తి పనిచేస్తుందన్నారు.మనిషిగా పుట్టినప్పుడు ఏం వెంట తీసుకురాలేదని, మరణం పొంది వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుపోలేమని చెబుతూ మనం ఉన్నంతలో దాన, ధర్మాలు చేసి పేరు సంపాధించుకోవాలని సూచించారు.కామాన్ని వ్యతిరికించిన అరుంధతి సృష్టిలో మంచి పేరు సంపాధించిందని చెబుతూ నూతనంగా పెళ్ళైన దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని చూపెడుతూ ఆమె పవిత్ర ధర్మాన్ని నేటి తరానికి వివరిస్తున్నారని భాస్కర శర్మ కొనియాడారు.శివ మహా పురాణంలోని, అనేక ఘట్టాలతో బాటు మరెన్నెన్నో చాలా మందికి తెలియని విషయాలను చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించారు.కార్యక్రమం అనంతరం భక్తులందరికీ మహా అన్న ప్రసాదం అందించారు. అన్న ప్రసాద సేవలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్,బట్టు రాజేందర్ సత్యసాయి సేవా సమితి సభ్యులుసేవలందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, జిల్లా ఉప వైద్య అధికారి డా.శ్రీనివాస్, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి,సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం,న్యాయవాది గ్యానసూర్యం, పాంపట్టి రవీందర్,చంద్రకళ, శ్రీలత,గంగ, విజయవాని,ఉటూరి కళ్యాణి, రజిత, లక్ష్మి, కళ్యాణి, నరేందుల అమర్,ఊటురి భాస్కర్, ఊటూరి లక్ష్మీనరసింహారావు, ఊటూరి వేణుగోపాల్, కొత్తపెళ్లి శ్రీనివాస్, ఊటూరి శ్రీనివాస్, ఊటురి ప్రసాద్, ఊటూరి మహేష్, ఊటూరి పుల్లయ్య, పాంపట్టి సులోచన, దేవరశెట్టి జనార్దన్, నాగభూషణం, ఊటూరి హరీష్, భక్తులు పాల్గొన్నారు.





