నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*తిరుపతి రూరల్* డిసెంబర్ 21మండలంలోని కుంట్రపాకంలో సర్పంచ్ శుభ పద్మనాభం రెడ్డి అద్వర్యం లో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపించారు, ముందుగా దూదేకుల సంఘం అధ్యక్షుడు కరిమల వళ్ళి ఆధ్వర్యంలో శ్రీరామ దేవాలయం వద్ద టపాకాయలు పేల్చి యువత కేరింతలు కొడుతూ తమ ప్రియతమ నేత పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం వారు తమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, మళ్ళీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్,జై అంటూ నినాదాలతో పల్లె మారుమ్రోగింది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం భారీ కేక్ కట్ చేసి అందరికి తినిపించారు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు,ఈ కార్యక్రమంలో పంచాయతీ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, ఎంపీటీసీ రెడ్డయ్య,పంచాయతీ యూత్ అధ్యక్షులు భరత్ కుమార్,పంచాయతీ బూత్ కమిటీ అధ్యక్షులు శ్రీహరి, సీనియర్ నాయకులు ఎమ్ చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు కిషోర్ రెడ్డి,సతీష్ రెడ్డి,లక్ష్మి ప్రసాద్ రెడ్డి,శ్రీధరరెడ్డి,అన్వర్ బాషా, వై రాజేంద్ర, రఫీ, చిన్న బాబు, లో తదితరులు పాల్గొన్నారు.





