(నేటిసాక్షి ప్రతినిధి మహేశ్వరం డిసెంబర్ 08:)*రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం మండల్ మాజీ అధ్యక్షులు. మాజీ సర్పంచ్ కావలి దశరథ మాట్లాడుతూ… గతంలో అభివృద్ధి అంటే ఏందో చేసి చూపించాం.. ఇప్పుడు కుండే ఈశ్వరయ్యని గెలిపించండి గ్రామ అభివృద్ధిని చేసుకుందామంటూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. గ్రామపంచాయతీ ఆఫీస్ తో పాటు గ్రామంలో 69 బోర్లకు గాను.. 59 బోర్లులలో నీళ్లు రావడం జరిగింది అదేవిధంగా ఏ కాలనీ అని చూడకుండా ప్రతి గల్లి గల్లి కి సిసి రోడ్లు మరియు గ్రామ దేవతల మందిరాలు, పీర్ల కోటాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అంతేకాకుండా కులమతాలకు అతీతంగా.. 60 గజాల ప్లాటు పట్టాలు అందజేయడం జరిగింది ఇప్పటివరకు దానిపై ఎవరు కూడా స్పందించలేదు.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రతి పేదవాడికి 60 గజాల ప్లాటు వచ్చే విధంగా చూస్తాం ఇప్పటివరకు 50 కి పైగా ఇందిరమ్మ ఇల్లు గ్రామంలో ఇప్పించడం జరిగింది ఇంకా ముందుకు వచ్చి మేము కట్టుకుంటామంటే 150 ఇండ్లు కట్టుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఇండ్లు మంజూరు చేయిస్తాను.. నేను మాటలతో చెప్పే వ్యక్తిని కాదు పని ఏంటో చేసి చూపిస్తాను అని మాజీ సర్పంచ్ కావలి దశరథ తెలియజేస్తూ.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కుండే ఈశ్వరయ్యని గెలిపించవలసిందిగా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది





