నేటి సాక్షి, బాపట్ల జిల్లా, (చీరాల)నీటి ప్రవాహ తగ్గిన తర్వాత కుందేరు వాగు డ్రైనేజీ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు.శనివారం రాత్రి చీరాల – బాపట్ల మధ్య లో ఉన్న కుందేరు వాగును చీరాల ఆర్డీఓ తో కలసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.తదుపరి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులతో మాట్లాడుతు కుందేరు వాగులలో నీటి ప్రవాహం తగ్గిన తర్వాత డ్రెనేజి నిర్మాణాల చేపట్టాలని మురుగునీటి (జలవనరుల)శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షాల వల్ల ఎక్కువ నీరు రావడంతో నీరు సంక్రాంగా వెళ్ళాక పోవడంతో గట్టు తెగిపోవడం వల్ల నీరు పొలాలలోకి వెళ్లడంతో రైతులు నష్టపోవడం జరుగుతుందని తెలిపారు, నీటి ప్రవాహం తగ్గిన వెంటనే డ్రైన్ పనులు చేపట్టాలని సంభందిత అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట చీరాల ఆర్డీఓ,చంద్రశేఖర్ నాయుడు,తహశీల్దార్ గోపి కృష్ణ, జలవనరుల శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.





