నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి :మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ దేవస్థానం పరిసర ప్రాంతాలలో కుక్కల సంచారం ఎక్కువగా ఉన్నది.అనునిత్యం తెలుగు రాష్ట్రాల నుండినే కాకుండా ఇటు కర్ణాటక అటు తమిళనాడు నుండి భక్తులు ఎక్కువగా వస్తుంటారు.భక్తూలు మిగిలిన ఆహార పదార్థాలు విచ్చలవిడిగా పడ వేయటంతో కుక్కల సంచారం ఎక్కువుగా ఉంది.యాత్రికుల ద్విచక్ర వాహనాల కింద దూరడం, యాత్రికులు పడి గాయాల పాలవడం కూడా జరుగుతున్నది. ఇటీవల కాలంలో పంచాయతీ సిబ్బంది కూడా కుక్కలు అతని ద్విచక్ర వాహనం కింద పడడంతో అతను కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు,ఈ మద్య కాలంలో ఒక యువకుడు కుక్కలు వెంబడించడంతో ద్విచక్ర వాహనం బోల్తాపడి చనిపోయిన సంఘటన కూడా జరిగింది.కావున సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా భక్తులు కోరుతున్నారు.





