నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలో అమానవీయ సంఘటన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కవర్ లో చుట్టి పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు, నెలలు నిండని ఆడ శిశువు మృతదేహం కుక్క నోట్లో కనపడి కలకలం రేపింది. వివరాలు ప్రకారం…పట్టణంలోని విద్యానగర్ కు వెళ్లే సబ్ జైల్ రోడ్ లో కుక్క ఆడ శిశు మృతదేహాన్ని నోటకరుచుకొని వెళ్తుండడంతో స్థానికులు గుర్తించి కవర్ విప్పి చూడగా బయటపడ్డ దారుణం. ఆడ శిశువు కావడంతోనే అబార్షన్ చేసి ఉంటారని, స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంట కలిసిన మానవత్వం ఆడపిల్ల అయినందుకేనా అని అన్నారు. సంఘటపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వన్ టౌన్ సీఐ నాగభూషణ రావు పోలీసులతో కలిసి ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. శిశువు మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు నేతలు, ప్రజాసంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





