Wednesday, March 18, 2026

కుత్బుల్లాపూర్‌లో కొత్త కల్యాణ మండపం నిర్మాణ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకుడు కొలన్ హన్మంత్ రెడ్డికుత్బుల్లాపూర్ నవంబర్ 15 (నేటి సాక్షి) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126వ డివిజన్ జగద్గిరిగుట్ట

పరిధిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయఆవరణలో నూతనంగా నిర్మించబోయే కల్యాణ మండప నిర్మాణ పనులను *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న హన్మంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కే. నరేందర్ రెడ్డి, ధర్మకర్తలు వేణు గౌడ్, బుచ్చిరెడ్డి, రవీందర్, మేడ్చల్ ఎస్సీ సెల్ కన్వీనర్ చెన్నయ్య, డివిజన్ అధ్యక్షులు గణేష్, మాజీ సర్పంచ్ మైసి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రషీద్ భాయ్, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, భరత్ గౌడ్, అలేటి శ్రీనివాస్, యువరాజ్, చంద్రశేఖర్, వీరారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అఖిల్, ఆర్.కే., సోమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News