నేటి సాక్షి తిరుపతి: జిల్లా (బాదూరు బాల) కుప్పం నియోజకవర్గం లో జరిగిన ఈ ఆటవిక, అనాగరిక సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీలు మద్దిల గురుమూర్తి, గుమ్మా తనూజ రాణి జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవహక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ అప్పు కట్టలేదని ఒక తల్లిని తన కన్న కొడుకు ఎదుటే చెట్టుకు కట్టేసిన సంఘటన తీవ్రంగా కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. అది ముఖ్యమంత్రి స్వయాన స్వంత నియోజకవర్గం కుప్పంలోనే ఇలా జరగడం శోచనీయమన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఎంపీ తెలిపారు.*

