Thursday, March 19, 2026

*కుప్పం బాదూరులో ఘనంగా రైతు సదస్సు*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం*మండలంలోని కుప్పం బాదూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధంగా శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల విద్యార్థినులు , ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి ఆధ్వర్యంలో రైతు సదస్సు ఘనంగా జరిగింది ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా దక్షిణ మండల వ్యవసాయ సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ వి సుమతి మాట్లాడుతూ రైతులకు ప్రకృతి , సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, పురుగు మందులు, రసాయనిక ఎరువులు వినియోగం తగ్గించుకుంటూ క్రమంగా ప్రకృతి మరియు సేంద్రియ వ్యవసాయం పద్దతిలో పంటలు సాగు చేస్తూ ప్రజల ఆరోగ్యం పర్యావరణ సమతుల్యతను కాపాడాలని సూచించారు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కృష్ణారెడ్డి కుప్పం బాదూరు, వేమూరు, బుచ్చి నాయుడు పల్లి గ్రామాల్లో విద్యార్థినులతో కలిసి పలు పంట సాగు విధానం రైతులకు అవగాహన కల్పించారు రైతు సమస్యలపై భవిష్యత్తులో వారికి మంచి అనుభవానికి ఉపయోగపడుతుందని తెలిపారు ఈ సదస్సులో స్థానిక టిడిపి మండల పార్టీ అధ్యక్షులు మేకల తిరుమలరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవసాయ అనుబంధంగా పలు రైతులకు పలు పధకాలను సబ్సిడీలను అందిస్తున్ననదని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా మండల వ్యవసాయ అధికారులు , శాస్త్రవేత్తలు సలహాలను పాటిస్తూ మంచి దిగుబడులు పొంది రైతులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు కుప్పం బాదూరు నుండి అభ్యుదయ రైతు నాదముని మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారని అందులో ప్రధానంగా కలుపు, చీడ పీడల సమస్యలను చీడ పీడ సమస్యలను అధికమించేందుకు తగిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని శాస్త్రజ్ఞులను కోరారు రామచంద్రపురం మండల వ్యవసాయ అధికారిణి మమత, తిరుపతి రూరల్ మండలం వ్యవసాయ అధికారి సుబ్బారావు లు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరంగా వివరించారు ఈ సదస్సులో భాగంగా పలు పంట సాగు విధానాలు, సమగ్ర వ్యవసాయం, జీవన ఎరువులు, నూతన రకాల వివరాలకు సంబంధించిన విజ్ఞానాన్ని అందిస్తూ చక్కని వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయగా పలువురు రైతులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సందర్శించారు ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వివిధ విభాగాలకు చెందిన ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ ప్రతిమ, డాక్టర్ నాగ మాధురి, డాక్టర్ జాన్ రైతులకు పలు సూచనలు చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామీణ వ్యవసాయం అనుభవం కోఆర్డినేటర్ డాక్టర్ కదిరి మోహన్, డాక్టర్ సునీత, గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సృజన కుమారి, రైతులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News