నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ధర్మకర్తల మండలి కమిటీ చైర్మన్ మరియు సభ్యులు ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.మాఘ పౌర్ణిమ సందర్భంగా నిర్వహించనున్న జాతర మహోత్సవాల సందర్భంగా దేవస్థానానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులు చర్చించి కార్యాచరణ రూపొందించారు. రేపటినుండి జాతర ఏర్పాట్ల పనులను ప్రారంభించేందుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ దేవాలయ కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి గౌరవనీయులు శ్రీ అజ్మీర శ్యామ్ నాయక్ గారు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ గారు, వైస్ చైర్మన్ గాజుల రవీందర్ గారు, ఆత్మ కమిటీ చైర్మన్ గడ్డల సత్తయ్య గారు, ఆర్టీఏ మెంబర్ ఎల్. రమేష్ గారు, గంగాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీ వి. వెంకటేశం చారి గారు, ఉప సర్పంచ్ ఇస్తారీ గారు పాల్గొన్నారు.అలాగే దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ లెండుగురే జయరాం, సభ్యులు మాజీ సర్పంచ్ లెండుగురే గంటుమెర, ఎల్. దుప్పనాయక్, అడపా విమల, వనమాల స్వప్న, మోడెం రాజా గౌడ్, దుర్గం అన్నాజీ, లోక లక్ష్మణ్, తణుకు మురళి, బొంగు నర్సింగరావు, ఎం. తులసిరామ్, సీహెచ్. గంగయ్య తదితరులు సమక్షంలో కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, మండల ప్రజాప్రతినిధులు, గంగాపూర్ మరియు రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం సోమయ్య, మోడెం సుదర్శన్ గౌడ్, చిరంజీవి గౌడ్, గూగులోత్ రవినాయక్, చెన్న సోమశేఖర్, జక్కయ్య, నిజాం, మడ్డి శ్రీనివాస్ గౌడ్, కేసరి కిషన్ గౌడ్, సురేందర్ రాజు, ఆలయ ఈఓ వేణుగోపాల్ గుప్తా, అర్చకులు కొమ్మెర గణేష్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

