నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఈ సందర్భంగా ఎస్పీ గారు మర్లవాయి గ్రామాన్ని సందర్శించి హైమెండార్ఫ్ మ్యూజియాన్ని పరిశీలించారు. ఆదివాసీల జీవన విధానం, సంప్రదాయాలు, సంస్కృతి, అలాగే హైమెండార్ఫ్ దంపతులు ఆదివాసీ సమాజానికి అందించిన సేవలపై అవగాహన పొందారు.అనంతరం గ్రామవాసులతో మమేకమై మాట్లాడిన ఎస్పీ గారు, వారికి బెడ్షీట్లు పంపిణీ చేశారు. అలాగే గ్రామంలోని పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి, విద్య యొక్క ప్రాధాన్యత, క్రమశిక్షణ, మంచి అలవాట్లపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ చేసి వారిని ప్రోత్సహించారు.తదుపరి, 39వ వార్షికోత్సవ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమం రోజున శాంతిభద్రతలకు భంగం కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేశారు.

