నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం*కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు గురువారం మండలంలోని కట్టెకిద్ద వెంకటాపురంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి – సంక్షేమంతో పాటుగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చిందని అన్నారు రైతులను ఆదుకునే దిశగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసిందని తెలిపారు అందులో భాగంగానే రామచంద్రాపురం మండలం కే.కే.వి పురం పంచాయతీలో అన్నదాత సుఖీభవ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు మండలంలో 4307 మంది రైతులు 2 కోట్ల 91 లక్షల రూపాయలు లబ్ధి పొందినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందేలా చూస్తున్నామన్నారు అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులైన రైతుల ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి అన్నదాత సుఖీభవ పథకం గూర్చి వివరించారు కే.కే.వి పురం పంచాయతీలో ఉన్న బీసీ హాస్టల్ ను గత వైసిపి ప్రభుత్వంలో చెవిరెడ్డి తుమ్మలగుంట లోకి మార్చుకున్నరని తెలిపారు గతంలోనే నేను కలెక్టర్ కి రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేశాను… అయినప్పటికీ ఎవరు స్పందించలేదని వాపోయారు ఇప్పుడు అదే బీసీ హాస్టల్ ను… ఇదే పంచాయతీకి తేవడానికి నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమల రెడ్డి, కార్యదర్శి రావిళ్ళ గిరిబాబు, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు జనార్థన్ నాయుడు, కోశాధికారి ఉమాపతి నాయుడు, ఉపాధ్యక్షులు కొట్టే గిరిధర్ రెడ్డి,చంద్రగిరి నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్, నాయకులు నీలకంఠ చౌదరి కొట్టే నరసింహా రెడ్డి, జెడి జగన్,కోరా హరిప్రసాద్, ఓరుగంటి మునెయ్య కొల్లం గుంట మునిరామిరెడ్డి, రాఘవేంద్ర నాయుడు, మధు,జీవరత్నం, వంశీ కృష్ణ,ముని మోహన్, శివశంకర్ , రవి ప్రసాద్,ఎమ్మార్వో మధుసూదన్ రావు,ఎంపిడిఓ పులిరామ్ సింగ్, మండల వ్యవసాయ అధికారి మమత, కమ్మపల్లి మెడికల్ ఆఫీసర్ ఛత్రప్రకాష్ర రెడ్డి, ఎపియం గురుమూర్తి, అంగన్వాడీ సూపర్ వైజర్ మనీలా, సెక్రటరీ ఝాన్సీ, హౌసింగ్ ఎఈ ఉమామహేశ్వరరావు,కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.





