సంబరాలలో తెలుగు తమ్ముళ్లు* నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) రామచంద్రపురం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రామచంద్రపురం మండలం అంబేద్కర్ కూడలిలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మేకల తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు బాణాసంచి పేల్చి, భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పండుగ వాతావరణం లో సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషకరం అన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో, జిల్లాలో, నియోజకవర్గంలో, మన మండలంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, అలాగే సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3000 నుంచి 4000, వికలాంగులకు 3000 నుంచి 6000, నడవలేని స్థితిలో ఉన్నవారికి 15000 ఇచ్చిన ఘనత మన చంద్రన్నదే అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రపంచ పటంలో నిలిపే యోధుడు మన చంద్రన్న తోనే సాధ్యమన్నారు. ముఖ్యంగా రామచంద్రపురం మండలంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో సీసీ రోడ్లు, గుండోడు కణం రోడ్డు, పులవ నాయుడు కండ్రిగ నుంచి వెదురు కుప్పం కి లింక్ రోడ్డు, ఉపాధి హామీ పథకం కింద దాదాపు 5 కోట్ల మేరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అభివృద్ధి సంక్షేమం సమానంగా చేసే ప్రభుత్వం మన ప్రభుత్వమని రాబోయే నాలుగు సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి వస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనార్దన్ చౌదరి, ఉమాపతి నాయుడు, కేశవుల నాయుడు, నరసింహారెడ్డి, గిరిధర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మునిరామిరెడ్డి, కమలాకర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, ముద్దుకృష్ణరెడ్డి, సుగుణ, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు