Wednesday, July 23, 2025

కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంది: పురపాలక శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)*తిరుపతి* జూన్14: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ లోని పలు హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తోందని, పెద్ద ఎత్తున సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయని, మున్సిపల్ శాఖ ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలను కనీస సౌకర్యాల కల్పనకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు.శుక్రవారం రామచంద్రాపురం మండలం సి.రామాపురం డంపింగ్ యార్డ్ ను మున్సిపల్ శాఖ మంత్రి గ్రీన్ అండ్ బ్యూటిఫికెషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మున్సిపల్ అధికారులు తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్రంలో గత ప్రభుత్వం వదిలి వెళ్ళిన 85 లక్షల టన్నుల లెగసినీ, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలతో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులను ఈ ప్రభుత్వానికి వదిలేసి వెళ్లారు అని అన్నారు. మన ముఖ్యమంత్రి విజన్ ఉన్న నాయకుడు అని, గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని అమలు చేశారని, అలాగే 2014-19 సంవత్సరంలో స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందనీ, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను అనేక కార్యక్రమాలు చేశామని, అనేక పరికరాలు కూడా మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగిందని, గత ప్రభుత్వం వాటిని పక్కన పడేసిందనీ, ఇప్పటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో ప్రకటించారనీ 365 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 85 లక్షలు టన్నుల చెత్తను క్లియర్ చేస్తామని తెలిపారని అన్నారు. అందులో భాగంగా పలు సార్లు సమావేశాలు, స్వచ్చాంద్ర కార్యక్రమాలు చేపట్టామని, అలాగే చెత్తను క్లియర్ చేయడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు 45 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేయడం జరిగిందని ఇంకనూ రాబోయే మూడు నెలలలో 35 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేయడానికి వేగవంతంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మన తిరుపతి జిల్లా తీసుకుంటే జిగ్మా అనే కంపెనీ ముందుకు వచ్చిందని వాళ్లు రోజుకు 900 టన్నుల లెగసి క్లియర్ చేస్తున్నారు. అయితే రోజుకు వారు 2700 టన్నులు క్లియర్ చేయాల్సీ ఉందనీ, ఏవైతే మున్సిపాలిటీలలో రోజువారీగా క్లియర్ చేయవలసిన లెగసీకన్నా తక్కువ చేస్తున్నారో సమీక్షించినప్పుడు వాటిని ప్రత్యక్షంగా పరిశీలించాలని జిల్లాల పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లా కు రావడం జరిగింది తెలిపారు. పవర్ కనెక్షన్ లేదని కంపెనీ వారి తెలుపుతున్నారని, జనరేటర్ మీద చేపడుతున్నారని సమస్యను క్లియర్ చేయాలని తెలుపగా జెసి గారిని ఫాలో అప్ చేయాలని ఆదేశించామని, నాలుగైదు రోజుల్లో పవర్ కనెక్షన్ ఇస్తామని ఎస్ఈ apspdcl తెలిపారని అన్నారు. ఈ లెగసి క్లియరెన్స్ కార్యక్రమంలో కృషి చేస్తున్న అధికారులందరినీ మరియు కంపెనీ ప్రతినిధులను ప్రత్యేకంగా అందరిని అభినందిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ శాఖ ద్వారా ప్రజలు కోరుకునేది ఏమంటే త్రాగడానికి స్వచ్ఛమైన నీరు, రోజువారిగా వచ్చే చెత్తను సాలిడ్ వేస్ట్ ను తొలగించడం, టాయిలెట్స్ నుంచి వచ్చే సీవరేజ్ వాటర్ ను క్లియర్ చేయడం, వర్షాలు వస్తే నీటిని బయటకు పోయేలా చేయడం, చక్కటి రోడ్లు, డ్రెయిన్లు కావాలని ప్రతి పౌరుడు కోరుకుంటారని అన్నారు. పార్కులు, సెంటర్ డివైడర్లు, మంచి స్కూల్లు, హాస్టళ్లు కావాలని ప్రజలు కోరుకుంటారు అన్నారు. సూపర్ సిక్స్ లో చెప్పిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉన్నామని, లోటు బడ్జెట్ తో ఉన్నా కూడా అనేక హామీలను అమలు చేశామని, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పెద్ద ఎత్తున పెంచి లబ్ధిదారులకు అందిస్తున్నామని, నిన్న ఒక్కరోజే పదివేల కోట్ల రూపాయలను తల్లికి వందనం కార్యక్రమం కింద ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరినీ చదివించడానికి ఒక్కొకరికి 15 వేల రూపాయల వంతున నిధులు జమ చేయడం జరిగిందని అన్నారు. ఆర్థికంగా రాష్ట్రం ఎంత కష్టంలో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేద మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు అందించే కార్యక్రమం అమలు చేస్తున్నామని అన్నారు. ఈ నెలలోనే మాట ఇచ్చిన ప్రకారం రైతులకు 20 వేల రూపాయలను అందించే కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.6000 ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ 14000 రూపాయలు మూడు దఫాలుగా ఇచ్చే నేపథ్యంలో మొదటి దశ డబ్బును ఈ నెలలో ఇస్తున్నాం అని తెలిపారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం జరుగుతుందని అని తెలిపారు. అన్నా క్యాంటీన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పట్టణాలలోని రెండు లక్షల 25 వేల మంది పేదల ఆకలి తీరుస్తున్నమని తెలిపారు. నాణ్యమైన భోజనం అయిదు రూపాయలకే రుచికరంగా అందిస్తున్నామని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమం ఇది అని అన్నారు. రానున్న కాలంలో ఈ రాష్ట్రంలోని 240 అన్నా క్యాంటీన్లే కాకుండా మరిన్ని 70 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం అమలుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మనిషికి స్వచ్ఛమైన నీరు అందించాలని, పలు రకాల జబ్బులు కలుషితమైన నీరు నుంచి వస్తాయని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని కొళాయి ద్వారా అందించే అభివృద్ధి స్కీం ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రాం 5350 కోట్ల కార్యక్రమం 2019 సంవత్సరం 70 శాతం కేంద్రం, 30% రాష్ట్రం వాటా ఉంటుందని, గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన కేంద్ర నిధులు నిలిచిపోయాయని, ప్రస్తుత ముఖ్యమంత్రి ద్వారా మళ్ళీ నిధుల విడుదలకు కేంద్రంతో మాట్లాడారని తెలిపారు. అలాగే స్వచ్చాంధ్రపై కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ శాఖ ద్వారా ప్రజలకు అందాల్సిన కనీస సౌకర్యాల ఏర్పాటుకు అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ, డబుల్ ఇంజన్ సర్కార్ పనితీరుతో అన్ని కార్యక్రమాలు అమలు అవుతున్నాయని, తిరుపతి జిల్లాలోని రామచంద్రాపురం మండలం సి.రామాపురం డంపింగ్ యార్డ్ ను పరిశీలించుటకు మునిసిపల్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ స్వయంగా పరిశీలించుటకు వచ్చారని మొన్ననే ఢిల్లీలో వేస్ట్ మేనేజ్మెంట్ పై పరిశీలించి అధికారులతో మాట్లాడి మన రాష్ట్రంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ మరింత మెరుగ్గా చేపట్టేందుకు అవకాశాలపై పరిశీలిస్తున్నారని తెలిపారు. సి.రామాపురం డంపింగ్ యార్డ్ నందు వేస్ట్ టు ఎనర్జీ తయారీ చెత్త నుండి సంపద సృష్టి జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజనీర్ గోమతి తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News