*చిత్తూరు జిల్లా :*గంగాధర నెల్లూరు నియోజకవర్గం,గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని ఐ.సీ.డీ.ఎస్ కార్యాలయంలో సీడీపీఓ పద్మ సునంద ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ” పోషణ్ మాహ్.. పోషకాహార మాసోత్సవాల ” కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డా. థామస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. *ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. థామస్ మాట్లాడుతూ..* జీడి నెల్లూరు నియోజకవర్గంలో మొత్తం 188 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని, అందులో ప్రాథమిక అంగన్వాడి కేంద్రాలు 141, మినీ అంగన్వాడి కేంద్రాలుగా 47 ఉన్నాయని తెలిపారు. ఇందులో భాగంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మన జీడి నెల్లూరు నియోజకవర్గంలో 43 అంగన్వాడి కేంద్రాలను ప్రాథమిక కేంద్రాలుగా మార్చడం జరిగిందని, రూ. 4 వేల రూపాయల జీతం నుండి 11,500 వేలుకు పెంచినట్లు గుర్తు చేశారు. ఈ ఆధునిక యుగంలో అంతర్జాతీయ ఆహారపు అలవాట్లు అలవాటుగా మారిపోయాయని, వాటిలో నిజానికి ఎలాంటి పోషక విలువలు లేదని సూచించారు. మన భారతీయుల సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడి ఉన్న గ్రామీణ ఆహారపు అలవాట్లు, పంటలు, చిరుతిళ్లలోనే ఎంతో పోషక విలువలు దాగి ఉందన్నారు. రానున్న తరాలకు అంగన్వాడీ ఉద్యోగులు, కార్యకర్తలు తప్పకుండా వాటిని ప్రాథమిక వయసు నుండి పిల్లలకు అలవాటు చేయాలని అన్నారు. అప్పుడే వారు వయసుతోపాటు శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎదగడానికి అవకాశం ఉందని సూచించారు. అలాంటి పిండము స్థాయి నుండి శిశువులు ఎదగడానికి సేవలు చేస్తున్న అంగన్వాడీలైన మీరు ఎంతో గొప్ప సేవా దృక్పథం కలిగి ఉండడం అభినందించదగ్గ విషయం అన్నారు. అంగన్వాడీల సేవలను ఎమ్మెల్యే అభినందించారు. సీడీపీఓ అధికారిణి వారు చేసుకున్న వినతికి ఎమ్మెల్యే థామస్ తక్షణమే స్పందిస్తూ..స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సహకారంతో బోరు సౌకర్యం, వేపంజేరి గ్రామంలో శిథిలమైన అంగన్వాడి కేంద్రంతోపాటు ప్రహరీ గోడ పునర్నిర్మాణ పనులు, నెల్లేపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రం ప్రహరీ గోడ నిర్మాణం, జీడి నెల్లూరులోని అంగన్వాడి కేంద్రానికి తహసీల్దారు సహకారంతో దారి సౌకర్యం.. మొ. అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా హామీ ఇచ్చారు. *సీడీపీఓ అధికారిణి పద్మ సునంద* మాట్లాడుతూ.. పోషణ్ మాహ్ మాసోత్సవాలను గత సెప్టెంబర్ 17 వ తారీఖు నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తల్లీ, బిడ్డ ఆరోగ్య రక్షణ, వారికి పోషకాహార లోపం లేకుండా చూసుకోవడమే.. అన్నారు. మా విజ్ఞప్తికి స్పందించి 44 అంగన్వాడి కేంద్రాలలోని పునర్నిర్మాణ చర్యలు చేపట్టడానికి, నీటి వసతికి, ప్రహరీ గోడ నిర్మాణానికి, మార్గం సుముగం చేయడానికి సహకరించిన ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రూ. 11,500 రూపాయల జీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన నెలసరి జీతాన్ని అందించడానికి హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆమె తెలిపారు.ఈ సందర్భంగా సీడీపీఓ అంగన్వాడి సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే థామస్ కు దుశ్యాలువ, పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోషకాహారాలను ఎమ్మెల్యే స్వయంగా రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు.. శ్రీమంతం, పోషకాహార పదార్థాలను అందజేసి చిన్నారులకు ఎమ్మెల్యే ఆశీర్వచనం పలికారు.ఈ కార్యక్రమంలో బీజెపీ ఇన్చార్జ్ రాజేంద్రన్, జనసేన ఇన్చార్జ్ యుగంధర్, మహిళ నాయకురాలు ఇందిరమ్మ, మండల అధ్యక్షుడు స్వామిదాస్ తో పాటు అంగన్వాడి సిబ్బంది, నియోజకవర్గంలోని కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.,




