నేటి సాక్షి తొగుట.. వడ్డే నరసింహులుచందాపూర్ గ్రామంలో కూడవెళ్ళి వాగు పెద్దమత్తడి వద్ద శుక్రవారం సాయంత్రం నుండి మత్తడి పరడం చాలా సంతోషకరమని మాజీ సర్పంచ్ బొడ్డు నర్సింలు యాదవ్ అన్నారు. అక్కడున్న కొంతమంది రైతులతో కలిసి చందాపూర్ పెద్దమత్తడి వద్ద మాట్లాడుతూ. కూడావెళ్లి వాగు చందాపూర్ మత్తడి నుండి ప్రవహించినప్పుడు వాగుకు ఎడమవైపున ఉన్నటువంటి కట్టు కాలువ నుండి జప్తి లింగారెడ్డిపల్లి, అల్వాల, మల్లుపల్లి,మీదుగా రుద్రారం వరకు ఈ కాల్వ ద్వారా నీరు ప్రవహిస్తోంది. కానీ గత నాలుగైదు సంవత్సరాల నుండి ఈ కట్టుకాలువను పట్టించుకున్న నాథుడే లేడు. కాల్వలో పూర్తిగా తుంగ ఇతర పిచ్చి మొక్కలు ముండ్ల చెట్లు నిడటంతో వాటిని గత నాలుగైదు సంవత్సరాల నుండి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదు. వారి నిర్లక్ష్యానికి గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు చందాపూర్ నుండి జప్తిరింగారెడ్డిపల్లి వరకు కట్టు కాలువ పూర్తిగా గండిపడి తెగిపోవడం తో కలవా కింద నాటు వేసి ఉన్న రైతులు అందరూ నష్టపోయారు అయినా ఆ రైతులను ఆదుకునే ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు,ఇప్పటివరకు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని ఇప్పటికీ ఆ రైతుల పొలాలలో గండ్లు పడ్డ సందర్భంగా యాసంగి కాలంలో నాటు కూడా వేయలేదు. అధికారులు వచ్చి కాల్వను పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూశారు. రైతులు ఇప్పటికైనా సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు కట్టు కాలువ పైన చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు బొడ్డు శ్రీకాంత్ యాదవ్,సిరిసిల్ల బాల్ నర్స్,బెజగామ,భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

