Wednesday, March 18, 2026

కూసుమంచిలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు..

నేటి సాక్షి పాలేరు , నవంబర్ 14 :జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ కూసుమంచి మండల కేంద్రంలో సంబరాలు చేసుకున్నారు.. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూసుమంచి క్యాంపు కార్యాలయం ఇంచార్జి భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు క్యాంప్ కార్యాలయం నుండి కూసుమంచి సెంటర్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి సెంటర్లో బాణాసంచా కాల్చి జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి , జై పొంగులేటి అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే క్యాంపు కార్యాలయం దగ్గర కార్యకర్తలు డాన్సులు వేస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ యరబోలు సూర్యనారాయణ రెడ్డి , మాదాసు ఉపేందర్ , జుకూరి గోపాల్ రావు , యడవల్లి రాంరెడ్డి , బజ్జూరి వెంకటరెడ్డి , కంచర్ల పవన్ రెడ్డి , సేట్రామ్ నాయక్ , లింగారెడ్డి , కొండ మహిపాల్ , బెల్లంకొండ కిరణ్ ,గుండా దామోదర్ రెడ్డి , బెల్లంకొండ వెంకన్న తదితర నాయకులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News