నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అకాడమిక్ ఆడిట్ బృందం శనివారం సందర్శిచారు. కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎట్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు 2022 – 23 మరియు 2023 – 24 సంవత్సరాలకు గాను కళాశాలలోని మౌళిక వసతులు, తరగతుల నిర్వహణను పరిశీలించడానికి రామన్నపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రెహత్ ఖానం, నల్లగొండ మహిళా కళాశాల సీనియర్ అధ్యాపకులు డా. వెంకటకృష్ణ కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి అన్ని రకాల సదుపాయాలను, వివిధ రకాల వసతులను, సైన్స్ ల్యాబ్ లను, లైబ్రరీ, స్పోర్ట్స్, ఎన్ఎస్ఎస్, ఎన్. సి.సి తదితర విభాగాలన్నింటిని వాటి యొక్క తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్. భీమార్జున రెడ్డి ని, అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని, నాగరాజు, విద్యార్దినీ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వచ్చే సంవత్సరం జరగబోయే న్యాక్ లో మంచి గ్రేడింగ్ సాధించే విధంగా అందరూ కృషి చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ భీమార్జున రెడ్డి తెలిపారు.





