Friday, February 20, 2026

కెఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో…”అర్థశాస్త్ర విభాగంలో జాతీయ వర్క్ షాప్” ప్రారంభం-క్వాంటిటీటివ్ మెథడ్స్ మాత్రమే భవిష్యత్తు తరాలకు ఉపాధి-ప్రొఫెసర్ టిఎల్ఎన్ స్వామి

నేటిసాక్షి, మిర్యాలగూడ : క్వాంటిటీటివ్ మెథడ్స్ మాత్రమే భవిష్యత్తు తరాలకు ఉపాధిగా ఉంటుందని ప్రొఫెసర్ టిఎల్ఎన్ స్వామి అన్నారు. పట్టణంలోని కెఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం ఉషా వారి ఆధ్వర్యంలో అర్థశాస్త్ర విభాగం నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ వర్క్ షాప్ ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ కు ముఖ్యఅతిథిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ టిఎల్ఎన్ స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ విసిటింగ్ ప్రొఫెసర్ ఎస్. ఇంద్రకాంత్ అధ్యక్షత వహించగా, కార్యక్రమం అర్థశాస్త్రం డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి అయినా డాక్టర్ గుమ్మడి నరేష్ సాధ్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ భీమార్జునారెడ్డి అధ్యక్షత వహించగా, కళాశాల సిపిడిసి మెంబర్ బండా రాఘవ రెడ్డి మరియు కళాశాల మాజీ ప్రిన్సిపల్ ప్రభాకర్ రావు ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథి పాల్గొన్న ప్రొఫెసర్ టిఎల్ఎన్ స్వామి మాట్లాడుతూ, ఏ శాస్త్రమైనా ముఖ్యంగా అర్థశాస్త్రం క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనేది లేకుండా వట్టి తీరి క్లాసులతో ఎక్కువ కాలం మనుగడలో కొనసాగలేదని, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యోగంలో ప్రభుత్వ డేటా నిర్వహణ సందర్భాలలో ప్రతి అధ్యాపకుడు తప్పనిసరిగా క్వాంటిటీటివ్ మెథడ్స్ పైన స్పష్టమైన నాలెడ్జిని కలిగి ఉండాలని అన్నారు. అనంతరం. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఇంద్రకాంత్ మాట్లాడుతూ, అధ్యాపకులు ముఖ్యంగా ఆర్ట్స్ విభాగానికి సంబంధించిన విద్యార్థులు క్వాంటిటీ టు మెథడ్స్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా స్టాటిస్టిక్స్ అయినా చాలా భయాందోళనలో ఉంటారని, ఆ సబ్జెక్టుల పైన భయాందోళనలు తొలగించడమే ఉపాధ్యాయుల కర్తవ్యం అని తెలియజేశారు. ఈ సందర్భంగా వర్క్ షాప్ నిర్వహణ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి నరేష్ మాట్లాడుతూ, ఈ వర్క్ షాప్ నిర్వహణ ముఖ్య ఉద్దేశం అధ్యాపకులను క్వాంటిటీటివ్ మెథడ్స్ పట్ల ట్రైనింగ్ నిర్వహించినట్లయితే వారి ఎఫెక్టివ్ గా టీచింగ్ చేయడానికి విద్యార్థులకు సులభంగా క్వాంటిటీటివ్ మెథడ్స్ కు సంబంధించిన పాఠాలు బోధించడానికి సులభతరం అవుతుందని, అలాగే ప్రముఖ రీసెర్చ్ పరిశోధనా సంస్థలు నిర్వహించే ప్రతిష్టాత్మకమైన వర్క్ షాప్ లను కేఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రామీణ వాతావరణం లో ఉండి కూడా అద్భుతమైనటువంటి పనితీరుతో అధ్యాపకులకు ఇటువంటి శిక్షణా తరగతులను నిర్వహిస్తుందని, ఈ వర్క్ షాప్ నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలు అందించిన కళాశాల ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ వర్క్ షాప్ కు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్న పీఎం ఉష రూసా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అయినటువంటి సౌందర్య జోసెఫ్ మేడంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం కి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ఏఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తలపెట్టే రీసెర్చ్ పరిశోధనా కార్యక్రమాలకు తన గురువుగారైనటువంటి ప్రొఫెసర్ ఇంద్రకాంత్ సహాయ సహకారాల ద్వారానే ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులో కూడా కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మరిన్ని పరిశోధనా కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ భీమార్జున్ రెడ్డి మాట్లాడుతూ, అర్థశాస్త్రంలో క్వాంటిటేటివ్ టెక్నిక్స్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుందని, కాబట్టి అధ్యాపకులు శిక్షణ నిర్వహించుకున్నట్లయితే, విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన కొనసాగించడానికి వీలు పడుతుందని, ఈ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్న అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ గుమ్మడి నరేష్ సార్ ను అభినందిస్తున్నానని తెలియజేశారు. అనంతరం కళాశాల సిపిడిసి మెంబర్ అయినటువంటి బండా రాఘవ రెడ్డి మాట్లాడుతూ, కేఎన్ఎం ప్రభుత్వ కళాశాలకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలను అందించడానికి ఈ పట్టణ పుర ప్రముఖుడిగా తన బాధ్యత నిర్వహిస్తున్నానని, కళాశాలలో అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ గుమ్మడి నరేష్, ఇది రెండవ కార్యక్రమంగా నిర్వహించడం కళాశాల యొక్క పరిశోధనా కార్యక్రమాల మెరుగుదలకు గీటురాయి అని, ఈ సందర్భంగా డాక్టర్ గుమ్మడి నరేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ, కెఎన్ఎమ్ ప్రభుత్వ కళాశాల చాలా ముందు చూపుతో రాష్ట్రంలో ఉన్న ఇతర కళాశాలలకు దీటుగా పరిశోధన కార్యక్రమాలను భుజంగా వేసుకొని ముందుకు వెళుతుందని, ఇందుకు తన డిపార్ట్మెంట్ కి సంబంధించిన గుమ్మడి నరేష్ను అర్థశాస్త్ర విభాగాన్ని కెఎన్ఎమ్ కళాశాల పరిశోధక విధానాన్నిఅభివృద్ధి చేస్తున్నందుకుగాను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో నుండి వివిధ ప్రాంతాల నుండి అర్థశాస్త్ర మేధావులు అధ్యాపకులు, ఇతర రాష్ట్రాల అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News