Friday, March 20, 2026

*కెసిఆర్ దీక్ష, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ*

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)= డిసెంబర్‌ 9 అనేది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు = రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్.కేసీఆర్‌ దీక్ష, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. విజయ్‌ దివస్‌ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలవేశారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ ఆమరుల స్దూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ… కేసీఆర్‌ అంటే పోరాటమని కేసీఆర్‌ దీక్ష ఫలితంగానే డిసెంబర్‌ 9 ప్రకటన వచ్చిందన్నారు. కేసీఆర్‌ దీక్షనే లేకపోతే డిసెంబర్‌ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా అని ప్రశ్నించారు. దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగి వచ్చేదా అని నిలదీశారు. డిసెంబర్‌ 9 అనేది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజునీ నవంబర్‌ 29న దీక్షా దివస్‌ జరుపుకున్నామని నవంబర్‌ 29 లేకపోతే డిసెంబర్‌ 9 తెలంగాణ ప్రకటన లేదన్నారు. డిసెంబర్‌ 9 లేకపోతే జూన్‌ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదని తెలంగాణ ఉద్యమంలో 3 రోజులు చాలా కీలకమైనవన్నారు. నిమ్స్‌లో కేసీఆర్‌ 11 రోజులు ఆమరణ దీక్ష ఫలితం డిసెంబర్‌ 9న ప్రకటన వచ్చింది. కేసీఆర్‌ దీక్షనే లేకపోతే డిసెంబర్‌ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేది కాదన్నారు. కార్యక్రమాల్లో మూల విజయ రెడ్డి, పాముకుంట్ల భాస్కర్ కుమ్మరి శ్రీనివాస్ కల్వచర్ల కృష్ణ వేణీ గాధం విజయ, బాదే అంజలి చెలకలపల్లి శ్రీనివాస్ బోడ్డుపల్లి శ్రీనివాస్ బుర్రి వెంకటేష్, నారాయణదాసు మారుతి దొమ్మెటీ వాసు చల్లా రవీందర్ రెడ్డి పిల్లి రమేష్ మేడి సదానందం ఆర్శనపల్లి శ్రీనివాస్ సట్టు శ్రీనివాస్ నీరటీ శ్రీనివాస్ కోడి రామకృష్ణ ఆవునూరి వెంకటేష్ బాలరాజు గుంపుల లక్ష్మి గుర్రం పద్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News