నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండలం లోని మాదాపూర్ గ్రామానికి చెందిన బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా చేస్తున్న బ్రిడ్జి పోరాటానికి సహకరించిన మూడు మండలాల ప్రజలకు పాత్రికేయులకు అలాగే సి ఆర్ ఐ ఎఫ్ నిధుల నుండి మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణానికి 77 కోట్ల రూపాయలు మంజురు చేయించినందుకు కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు . అనంతరం ఉదయ్ కుమార్ మాట్లాడుతూ బ్రిడ్జి పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని అయన కోరారు.





