నేటి సాక్షి, కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా నియమితులైన సందర్భంగా కరీంనగర్ బీజేపీ, రాష్ట్ర జిల్లా నేతలు ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్‌ను కలిసిన వారిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి, కాసింపేట ఎంపీటీసీ ఏలేటి స్వప్నచంద్రరెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు అన్నాడి రాజిరెడ్డి, జిల్లా నాయకులు ముదిగంటి విద్యాసాగర్‌రెడ్డి, కొత్తకొండ వెంకటసాయి, పారిపెల్లి రాజు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఎన్నిక కావడం తెలంగాణకు, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు గర్వకారణమన్నారు. సామాన్య కార్యకర్త నుండి కేంద్ర మంత్రి స్థాయి వరకు బండి రాణించారని, నిస్వార్ధంగా పనిచేసిన వారికి పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.