Friday, March 20, 2026

*కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులన రద్దు చేయాలని డిమాండ్*

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల పై, నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన కార్మిక సంఘాలు.కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ,నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన ధర్నా లో ఏఐటియుసి, ఐఎన్టీయుసి, సిఐటియు మరియు టిబిజికేఎస్ సంఘాల నాయకులు కొరిమి రాజ్ కుమార్, ఎం.శ్రీనివాస్, టి.రాజిరెడ్డి, మాదాసు రాంమూర్తి, వడ్డెపల్లి శంకర్ లు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రసంగించారు. ముఖ్యంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేకుంటే సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ను కలుపుకొని మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నా అనంతరం అర్జీ వన్ జనరల్ మేనేజర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, బ్రాంచి ఉపాధ్యక్షులు మాదన మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రీను, ఐఎన్టీయుసి నాయకులు సదానందం, సిఐటియు నాయకులు మెండె శ్రీనివాస్, ఆరెపెల్లి రాజమొగిలి , టిబిజికెఎస్ నాయకులు చెలకలపల్లి శ్రీనివాస్, చల్లా రవిందర్ రెడ్డి లతో పాటు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News