Tuesday, January 20, 2026

కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి ప్రచారం చేయాలి…భారతీయ జనతా పార్టీ బుగ్గారం మండల అధ్యక్షులు మెడ వేణి శ్రీధర్…

నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్* ( గుండ ప్రశాంత్ గౌడ్ )బుగ్గారం :బుగ్గారం మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు మేడ వేణి శ్రీధర్ అధ్యక్షతన బిజెపి మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథి బిజెపి జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ రాష్ట్ర స్వచ్ఛభారత్ కన్వీనర్ మంచే రాజేష్ వచ్చారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేడ వేణి శ్రీధర్ మాట్లాడుతూ 11 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలో సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న భారతదేశం నాలుగవ స్థానానికి చేరుకుందని రానున్న రోజుల్లో అమెరికా,జర్మనీ తర్వాత అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా.అవతరించబోతుందని అన్నారు. 11 ఏళ్ల పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తీసుకువచ్చిన ఉచిత సిలిండర్, ఇంటింటికి మరుగుదొడ్డి, గత అయిదేళ్లుగా ఉచిత బియ్యం పంపిణి, కిసాన్ సమ్మాన్ నిధి,అసంఘటిత కార్మికులకు ఏడాదికి 12 రూపాయలకే బీమా, బేటీ పడావో బేటీ బచావో, పెద్దనోట్లు రద్దు లాంటి సంక్షేమ పథకాలను అమలు చేసి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందే విదంగా కృషి చేస్తున్నారని అన్నారు. మరోపక్క 370 ఆర్టికల్ రద్దు, వక్ఫ్ బోర్డు సవరణ,జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వే లైన్ ల అభివృద్ధి, ఇవాళ జమ్ము కాశ్మీర్ లో కొండల మధ్య రైళ్లు పరుగెడుతున్నాయంటే మోడీ చొరవవల్లనేనని అన్నారు.మోడీజీ తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటింటికి ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు కృషిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. బిజెపి రాష్ట్ర శాఖ సూచన మేరకు జూన్ 5 నుండి ఆగస్టు 15 వరకు ప్రతి బూతులో కనీసం 11 మొక్కలు నాటి వాటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. ఆత్మనిర్బర్ లో భాగంగా మేక్ ఇండియా,మేడ్ ఇండియా,స్కిల్ ఇండియా లాంటి పథకాల ద్వారా భారతదేశం సొంత పరిజ్ఞానంతో ఆపరేషన్ సింధూర్ లో ప్రయోగించబడిన బ్రహ్మోస్ మిస్సైల్స్ ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేశాయని అన్నారు.ఇట్టి సమావేశంలో బుగ్గారం మండల ప్రధాన కార్యదర్శి మందపల్లి శ్రీనివాస్ దొన కొండ అనిల్ బిజెపి మండల ఉపాధ్యక్షులు కేతి రవీందర్ రెడ్డి బండారి సత్తన్న, కార్యదర్శి నరేష్ సునీల్ కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు కందునూరు లచ్చయ్య బీజేవైఎం మండల అధ్యక్షులు చీపిరిశెట్టి మధుకర్ భూత్ అధ్యక్షులు వడకాపురం సతీష్ చెట్ల సునీల్ పంచిత మల్లేష్ గడ్డం మహేష్ గోలి లింగారెడ్డి సంపత్ రావు తదుపరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News