హీరోయిన్ తో కేటీఆర్ కు అక్రమ సంబంధం అంటగట్టడం ఎంతవరకు నీకు సమంజసం…నీ పార్టీలో తల్లి లాంటి మహిళ నేతలు ఉన్నారని మర్చిపోయావా..!ఆధారాలు ఉంటే బేషరత్ గా నిరూపించు.. లేకుంటే ముక్కు నేలకు రాయి…ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు మానుకో కాంతం.. లేకుంటే నీ అంతు చూస్తాం…వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ నేతల ప్రెస్ మీట్….నేటిసాక్షి వేములవాడ :తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత గజ్జల కాంతం చేసిన అనుచిత వ్యాఖ్యలను వేములవాడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ తీవ్రంగా ఖండించారు. పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి ప్రదాత, యువతకు రోల్ మోడల్ మాజీ మంత్రి కేటీఆర్ కు హీరోయిన్ తో అక్రమ సంబంధం అంటగట్టడం ఎంతవరకు నీకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. నీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో మీడియా ముందు చూపించు లేకుంటే ముక్కు నేలకు రాసి యావత్ తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా నీ పార్టీలో కూడా తల్లిలాంటి మహిళ నేతలు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయావా కాంతం అంటూ ఏద్దేవా చేశారు. గతంలో కొండ సురేఖ కూడా హీరోయిన్ తో అక్రమ సంబంధం అంటగట్టి యావత్ సినీ పరిశ్రమను అవమానపరిచిందని గుర్తు చేశారు. మరోసారి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల్లో నీ అంతు చూస్తామంటూ వారు హెచ్చరించారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుమ్మరి శ్రీనివాస్, సిరిగిరి చందు, తంపుల సుమన్, పండుగ తిరుపతి, మల్లారం తిరుపతి, తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

