Thursday, March 12, 2026

కేబుల్‌ బ్రిడ్జి పై రోడ్డును వేయాలి ఏఐఎఫ్‌బీ జిల్లా కార్యదర్శి శేఖర్‌

నేటిసాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ కేబుల్‌ బ్రిడ్జి పై రోడ్డును వేయాలని, లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని ఏఐఎఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్‌ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా శేఖర్‌ మాట్లాడుతూ కేబుల్‌ బ్రిడ్జి పై ఉన్న గుంతలతో ఇప్పటికే 15 దాకా ప్రమాదాలు జరిగాయని, ముగ్గురు చనిపోయారన్నారు. కోట్లాది రూపాయలతో కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణంలో అంతులేని అవినీతి జరిగిందని, ఉమ్మడి జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా చేసిన అభివృద్ధి సున్నా అని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడి కేబుల్‌ బ్రిడ్జి చౌరస్తా వద్ద హైమాస్డ్‌ లైట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం యూత్‌ రాష్ట్ర నాయకుడు ఆవుల ఆదిత్య ఆధ్వర్యంలో కేబుల్‌ బ్రిడ్జికి పట్టిన దరిద్రం పోవాలని గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్‌బీ జిల్లా కమిటీ సభ్యులు కె. బద్రినేత, నాయకులు సాయిఅనురాగ్‌, ఆనంద్‌, శ్రవణ్‌, పవన్‌, రఘు, సాయికిరణ్‌ రెడ్డి, సాయికిరణ్‌రావు, పవన్‌పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News